Gehlot: ఉచిత వ్యాక్సిన్‌ భారతీయుడి హక్కు - every indian has right to free vaccine says ashok gehlot
close
Published : 04/06/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gehlot: ఉచిత వ్యాక్సిన్‌ భారతీయుడి హక్కు

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌

జైపూర్: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఓ వైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సరైన విధానాలను అనుసరించడం లేదనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా కేంద్రం తీరుపై పెదవి విరిచింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల నుంచి వ్యాక్సినేషన్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉచితంగా వ్యాక్సిన్‌ పొందడం ప్రతి ఒక్క భారతీయుడి హక్కు అని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ వ్యాఖ్యానించారు. దేశంలో ఆరోగ్య విపత్తు తలెత్తినప్పుడు కేంద్రం అందరికీ వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురాకపోవడం నిజంగా అన్యాయమంటూ ఆయన ట్వీట్‌ చేశారు. సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు గత ప్రభుత్వాలు ఇలాగే పని చేశాయా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.  

కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆన్‌లైన్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన ఓ సమావేశంలో సీఎం గెహ్లోత్‌ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు వ్యతిరేకంగా మనమంతా గళం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రజలకు కాంగ్రెస్‌ నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని