సుస్మిత వల్ల నా లైఫ్‌ మారింది..! - everything in my life changed after i met sushmita sen
close
Published : 06/02/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుస్మిత వల్ల నా లైఫ్‌ మారింది..!

పెళ్లి జరిగితే బయటపెడతాం: రోహ్మాన్‌షాల్‌

ముంబయి: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ను కలిసిన తర్వాత తన జీవితం ఎంతో మారిందని ప్రముఖ మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌ అన్నారు. ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించిన రోహ్మాన్‌ మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టి మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలోనే వయసులో తనకంటే పెద్దదైన సుస్మితాసేన్‌తో పరిచయం.. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే విషయం తెలిసిందే.

కాగా, తాజాగా రోహ్మాన్‌ తన ప్రేయసి సుస్మితాసేన్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘మోడల్‌గా  ముంబయికు వచ్చిన రెండేళ్ల తర్వాత సుస్మిత నాకు పరిచయమయ్యింది. అప్పటి నుంచి నా జీవితం ఎంతో మారిపోయింది. స్టార్‌ లైఫ్‌ ఎలా ఉంటుందో బాహ్య ప్రపంచానికి తెలీదు. వాళ్లతో కలిసి ఉన్నప్పుడే మనకు వాళ్ల కష్టాలు, కన్నీళ్లు అర్థమవుతాయి. నాకు కూడా తనని కలిసిన తర్వాత జీవితమంటే ఏమిటో సరిగ్గా అర్థమైంది’

‘మేమిద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామా?అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నేను, సుస్మిత, ఆమె పిల్లలు ఒక కుటుంబంలా ఉంటున్నాం. కొన్నిసార్లు నేను ఒక తండ్రిగా, మరికొన్నిసార్లు స్నేహితుడిగా ఉంటూ ఆ పిల్లల్ని చూసుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో మా మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. కాబట్టి పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే తప్పకుండా చెబుతాం’ అని రోహ్మాన్‌ వివరించారు.

ఇదీ చదవండి

కోట్లతో సినిమా.. రీమేక్‌ ముద్రమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని