ఈటలతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ - ex mp konda vishweshwar reddy meets eatala rajender
close
Published : 07/05/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈటలతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ

శామీర్‌పేట్‌: రాజకీయంగా జరిగిన విషయాలను పట్టించుకోవద్దని, అవమానకరంగా భావించొద్దని చెప్పేందుకే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసినట్లు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ రాత్రి శామీర్‌పేటలోని ఈటల ఇంటికి వచ్చిన కొండా దాదాపు గంటపాటు వివిధ అంశాలపై ఈటలతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను రాజకీయాలపై చర్చించేందుకు ఈటల ఇంటికి రాలేదు. సానుభూతి తెలియజేసేందుకే వచ్చాను. ఈటల సతీమణి జమునా రెడ్డి నా సమీప బంధువు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజలు ఆయన వెంట ఉంటారని చెప్పాను. ఇతర విషయాలు ఏమీ మాట్లాడలేదు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇదొకటి’’ అని కొండా వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని