రాంప్రసాద్‌పై కొరడా ఝుళిపించిన గెటప్‌ శ్రీను - extra jabardsath promo
close
Published : 27/10/2020 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాంప్రసాద్‌పై కొరడా ఝుళిపించిన గెటప్‌ శ్రీను

‘ఠాగూర్‌’ స్పూఫ్‌ చూశారా..!

హైదరాబాద్‌: కమెడియన్‌ రాంప్రసాద్‌పై గెటప్‌ శ్రీను కొరడా ఝళిపించారు. త్వరలో ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో వీరిద్దరూ ఆటో పంచులతో ప్రేక్షకులను అలరించనున్నారు. రష్మి వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. రోజా, మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న ఈ కామెడీ షోకు సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

వచ్చే గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో భాగంగా ‘ఠాగూర్‌’ సినిమాలోని ఓ సన్నివేశంపై సుడిగాలి సుధీర్‌ టీమ్‌ సరదాగా స్కిట్‌ చేయనున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. స్కిట్‌లో భాగంగా శ్రీను.. చిరంజీవి గెటప్‌లో స్టేజ్‌పైకి వచ్చి.. కామెడీ సరిగ్గా చేయడం లేదని ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ టీమ్‌ లీడర్లను నిలదీస్తాడు. రాంప్రసాద్‌ దగ్గరికి వెళ్లి.. ‘భయమంటే తెలుసా నీకు’ ప్రశ్నించగా.. ‘భయమనే పదమే నా డిక్షనరీలోలేదు. ఎందుకంటే నా దగ్గర డిక్షనరీ లేదు’ అంటూ ఆటో పంచుల వర్షం కురిపిస్తాడు. దీంతో శ్రీను.. రాంప్రసాద్‌ని  సరదాగా కొరడాతో దండిస్తాడు. అనంతరం స్కిట్‌పై శ్రద్ధ చూపించమని కోరుతూ సుధీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. చిన్న పిల్లల్తో రాకేశ్‌ చేసిన స్కిట్‌, వైద్యుడి గెటప్‌లో బుల్లెట్‌ భాస్కర్‌ వేసిన పంచులు నవ్వులు పూయిస్తున్నాయి. అక్టోబర్‌ 30న ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ప్రోమో చూసేయండి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని