సేవలు బంద్‌ చేసుకోవడం మినహా వేరే దారి లేదు! - facebook twitter google threaten to quit hong kong over proposed data laws
close
Published : 06/07/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సేవలు బంద్‌ చేసుకోవడం మినహా వేరే దారి లేదు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్నిచోట్ల సోషల్‌ మీడియా కంపెనీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. భారత్‌లో ట్విటర్‌కు, ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హాంకాంగ్‌లో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌, ఆల్ఫాబెట్‌ కంపెనీలు.. అక్కడి ప్రభుత్వం డేటా పరిరక్షణ చట్టాలకు చేయబోయే సవరణలకు సంబంధించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఎవరైనా ఒక ఖాతాదారుడు మరొకరికి నష్టం కలిగించేలా, హానికరమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకుంటే, దానికి ఆయా కంపెనీలే జవాబుదారీగా ఉండాల్సి వస్తోంది. ఇదే ప్రతిపాదిత చట్ట సవరణల్లోని ప్రధాన అంశం. దీనివల్ల, సోషల్‌ మీడియాలో ఎవరైనా ఏదైనా పోస్టు పెడితే,  అప్పుడు ఆయా సంస్థల సిబ్బందే నేరారోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గత మే నెలలో స్థానిక ప్రభుత్వం డాటా పరిరక్షణ చట్టాలకు కొన్ని సవరణలను సూచించింది. ఈ సవరణల ముసుగులో.. సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించడం ద్వారా 2019లో జరిగిన అల్లర్లు వ్యాప్తి చెందకుండా అదుపులో పెట్టవచ్చనేదే ప్రభుత్వం ఆలోచన. ఒకవేళ ఈ చట్ట సవరణలను అమలు చేస్తే, సదరు మీడియా సంస్థల ఉద్యోగులు ప్రతి తప్పుకూ పదిలక్షల హాంకాంగ్‌ డాలర్లను చెల్లించడంతోపాటు, ఐదేళ్లపాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.

పట్టుబిగిస్తే.. పెట్టుబడుల తరలింపే!

‘‘కఠినమైన చట్టాల బారినపడకుండా ఉండాలంటే తమలాంటి కంపెనీలకున్న ఏకైక మార్గం హాంకాంగ్‌లో పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే.  తమ సేవలను అక్కడ అందించకుండా ఉండటం తప్ప మరే గత్యంతరం లేదు’’ అని ఆయా కంపెనీలు ప్రభుత్వానికి జూన్‌ 25న రాసిన లేఖలో స్పష్టం చేశాయి. గతేడాది చైనాకు వ్యతిరేకంగా నిరసనకారులు ఉద్యమించినప్పుడు  డ్రాగన్‌ దేశం హాంకాంగ్‌పై మరింత పట్టు బిగించింది. అంతేకాదు, స్థానికంగా ఉంటున్న అమెరికా కంపెనీలకు, హాంకాంగ్‌ ప్రభుత్వానికి మధ్య మనస్పర్ధలు చెలరేగాయి. అప్పట్లో జాతీయ భద్రత ముసుగులో చైనా తన అధీనంలో ఉన్న నిరసనకారులపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని