చైనాలోనే కొవిడ్‌ నకిలీ టీకా రాకెట్‌ సూత్రధారి! - fake covid vaccine rocket leader arrested in china
close
Updated : 17/02/2021 05:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనాలోనే కొవిడ్‌ నకిలీ టీకా రాకెట్‌ సూత్రధారి!

బీజింగ్‌: నకిలీలు, చౌకబారు వస్తువుల ఉత్పత్తికి చైనా మారుపేరు. ఇక మహమ్మారి కొవిడ్‌ మూలాలు ఇక్కడే ఉన్నాయనే అపకీర్తినీ ఈ దేశం మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో అనేక మిలియన్ డాలర్ల విలువైన నకిలీ కరోనా టీకా కుంభకోణానికి సూత్రధారి కూడా ఆ దేశంలోనే పట్టుబడటం గమనార్హం.

కాంగ్‌ అనే పేరున్న ఈ ఘరానా మోసగాడు నిజమైన వ్యాక్సిన్ల ప్యాకేజింగ్‌, డిజైన్లను బాగా పరిశోధించాడు. అనంతరం ఏకంగా 58 వేల నకిలీ టీకా సమ్మేళనాలను సృష్టించాడు. టీకా ఔషధానికి బదులుగా మినరల్‌ వాటర్‌, సెలైన్‌ ద్రావణం ఆ సీసాల్లో నింపేవాడట. వీటిని సముద్రమార్గంలో విదేశాలకు స్మగ్లింగ్ చేసేవాడు. ఈ విధంగా గత ఆగస్టు నుంచి చేస్తున్నట్టు తెలిసింది. గత నవంబర్‌లో 600 బ్యాచ్‌ల నకిలీ వ్యాక్సిన్‌ను హాంకాంగ్‌కు పంపాడు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్‌ బృందం 2.78 మిలియన్ డాలర్లు ఆర్జించింది. కాగా, ఈసారి వాటిని ఎక్కడకు పంపాలనుకున్నదీ తెలియరాలేదు.

ఈ నకిలీ టీకాలను ఆస్పత్రులకు అత్యధిక ధరలకు విక్రయించేవారు. ఇక వీటిని చేజిక్కించుకున్న కొంతమంది, తామే స్వయంగా టీకా కార్యక్రమాలను నిర్వహించటం గమనార్హం. మరి కొందరు గ్రామీణ డాక్టర్లు, ఈ నకిలీ వ్యాక్సిన్లను ప్రజల కార్లు, ఇళ్ల వద్దకే వెళ్లి అందచేసి డబ్బు చేసుకునేవారు. నకిలీ టీకాలకు సంబంధించిన నేరాలకు గానూ చైనాలో ఇప్పటికి 70 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ విధమైన చర్యలను అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలంటూ చైనా అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని