‘మాయాబజార్‌’ అంటే జంధ్యాలకు అంత మక్కువ - famous director jandhyala likes mayabazar movie
close
Updated : 25/04/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మాయాబజార్‌’ అంటే జంధ్యాలకు అంత మక్కువ

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినీ తెరపై నవ్వుల పువ్వులు పూయించడమే కాకుండా తనదైన శైలిలో ప్రాసలు, పంచ్‌ డైలాగులతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుల్లో జంధ్యాల ఒకరు. ఆయన తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికీ సినీ ప్రియుల్ని ఆకర్షిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే.. జంధ్యాలకు ‘మాయాబజార్‌’ చిత్రమంటే మక్కువ. మరీ ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ‘మాయాబజార్‌’ విడుదలైన సుమారు 30 యేళ్ల తర్వాత కూడా ఆయన తెరకెక్కించిన కొన్ని చిత్రాలకు ఆ సినిమాలోని పాటల్నే టైటిల్స్‌గా పెట్టుకున్నారు. ఇంతకీ ఆ సినిమాలేమిటో మీరూ చూసేయండి.

‘అహ నా పెళ్లంట.. ఒహో! నా పెళ్లంట’

‘అహ నా పెళ్లంట.. ఒహో నా పెళ్లంట’ అంటూ ‘మాయాబజార్‌’లో అలనాటి నటి సావిత్రి చేసే సందడి అంతా ఇంతా కాదు. అందుకే ఆ పాటను ఇప్పటికీ పలువురు నోటి నుంచి వింటూనే ఉంటాం. ఆ పల్లవినే టైటిల్‌గా పెట్టి జంధ్యాల తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘అహ నా పెళ్లంట’. అంతేకాకుండా ‘ఒహో నా పెళ్లంట’ అనే చిత్రాన్ని కూడా ఆయనే రూపొందించారు.

‘వివాహ భోజనంబు’

‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు’ అంటూ ప్రముఖ నటుడు ఎస్వీరంగారావు పాకశాలలో చేసే జిమ్మిక్కులతో అందర్నీ ఆకర్షిస్తారు. 1988లో అదే పాటని టైటిల్‌గా మార్చుకుని జంధ్యాల తెరకెక్కించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. ఈ సినిమాతో ఆయన అందర్నీ ఎంతో నవ్వించారు.

‘చూపులు కలసిన శుభవేళ’

‘చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము...’ అనే ప్రణయ గీతంలో ఏఎన్నార్, సావిత్రిల మధ్య చూపించే అనుబంధం ఎంత మధురంగా ఉంటుందో, ఆ పల్లవితో జంధ్యాల తెరకెక్కించిన ‘చూపులు కలసిన శుభవేళ’ చిత్రమూ అంతే చూడముచ్చటగా ఉంటుంది.

‘హై హై నాయకా’

కేవలం పాటలకు మాత్రమే పరిమితం కాకుండా అందులోని ఓ ఫేమస్‌ డైలాగును సైతం జంధ్యాల టైటిల్‌గా మార్చేశారు. ఘటోత్కచుడి శిష్యగణం ఆయనకు జేజేలు పలుకుతూ చెప్పే ఈ డైలాగ్‌నూ టైటిల్‌గా చేసి ‘హై హై నాయకా’ సినిమా తీయడం జంధ్యాలకే చెల్లింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని