బ్యాట్‌తో ఈ బాలుడి విధ్వంసం చూశారా.. - fans are praising the phenomenal batting of boy
close
Published : 16/09/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాట్‌తో ఈ బాలుడి విధ్వంసం చూశారా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ బుడతడు బ్యాట్‌తో కేక పుట్టిస్తున్నాడు.  అతడు ఎడమచేతివాటంతో బాల్‌ను బలంగా బాదుతూ పలువురు క్రికెటర్లను మరిపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే భారత మాజీ కెప్టెన్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా సైతం ఆ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ ఆ బాలుడిని ప్రశంసించాడు. వీడియోలో మెట్ల మీద నిలబడి బ్యాటింగ్‌ చేస్తున్న ఈ చిచ్చరపిడుగు.. బంతి రావడమే ఆలస్యం దాన్ని బలంగా బాదుతూ క్రికెట్‌ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ బాలుడిని పలువురు దిగ్గజాలతో పోలుస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పలువురు క్రీడాభిమానులు విండీస్‌ విధ్వంసకారుడు క్రిస్‌ గేల్‌తో పోలుస్తుంటే, మరికొందరు భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ను గుర్తుకుతెస్తున్నాడంటున్నారు. ‘బాలుడు బ్యాట్‌ను స్వింగ్‌ చేసే విధానం అద్భుతంగా ఉంది. జూనియర్‌ క్రిస్‌ గేల్‌లా కనిపిస్తున్నాడు’ అంటూ పేర్కొన్నాడు. ‘అతడి బాదుడు చూస్తుంటే 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌సింగ్‌ ఆరు సిక్సులు గుర్తుకువస్తున్నాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు‌ చేశాడు.
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని