Toofaan: కొత్త విడుద‌ల తేదీ ఖ‌రారు - farhan akhtar toofaan movie release date conformed
close
Published : 16/06/2021 22:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Toofaan: కొత్త విడుద‌ల తేదీ ఖ‌రారు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన హిందీ చిత్రం ‘తుఫాన్‌’. ఫ‌ర్హాన్ అక్త‌ర్ క‌థానాయ‌కుడు. రాకేశ్ ఓంప్ర‌కాశ్ మెహ్రా ద‌ర్శ‌కుడు. తాజాగా కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది చిత్ర బృందం. ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ చిత్రం. ముందు నుంచీ ఈ సినిమాని డిజిట‌ల్ మాధ్య‌మంలోనే రిలీజ్ చేయాల‌నే నిర్ణ‌యించారు ద‌ర్శ‌కనిర్మాతలు. వేసవి కానుక‌గా మే 21న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ, కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా వాయిదా వేశారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు కాస్త కుదుట‌ప‌డుతుండ‌టంతో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌‌, పరేష్‌ రావల్‌, ఇషా తల్వార్‌ కీలక పాత్రలు పోషించారు. ‘భాగ్ మిల్ఖా భాగ్‌’ తర్వాత ఫర్హాన్‌ అక్తర్‌- రాకేశ్‌ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో ‘తుఫాన్‌’పై భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. 

 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని