కొవిడ్‌ పేరు చెప్పి ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు - fear of covid not ground for granting anticipatory bail says sc
close
Published : 25/05/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ పేరు చెప్పి ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు

అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

దిల్లీ: అరెస్టు చేసి జైలుకు పంపిస్తే కొవిడ్‌తో చనిపోతారన్న భయాన్ని ఆధారంగా చేసుకుని ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ముందస్తు బెయిల్‌పై ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఓ కేసులో నిందితుడిగా ఉన్న ప్రతీక్‌ జైన్‌ అనే వ్యక్తి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అలహాబాద్‌ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘అరెస్టుకు ముందు లేదా తర్వాత గానీ నిందితుడికి కరోనా సోకితే.. అది అతడి నుంచి పోలీసులు, కోర్టులు, జైలు సిబ్బందికి వ్యాపించే ప్రమాదం ఉంది. వైరస్‌తో ప్రాణ భయం కూడా ఉంది. అందువల్ల నిందితుడికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఇది సరైన కారణమే’’అని హైకోర్టు తీర్పు వెలువరించింది.

అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహమ్మారి ఇప్పుడప్పుడే పూర్తిగా తొలగిపోయే అవకాశం లేనందున ఈ కారణం చూపి నిందితుడికి బెయిల్‌ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అంతేగాక, దీన్ని అవకాశంగా తీసుకుని నేరం చేసిన వ్యక్తులు స్వేచ్ఛగా బయట తిరుగుతారని పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కొవిడ్‌ భయాన్ని కారణంగా చూపి నిందితులకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని పేర్కొంది. ఈ ఉత్తర్వులను ఇతర కోర్టులు పరిగణనలోకి తీసుకోవద్దని సూచించింది. కేసు అర్హతలను బట్టి మాత్రమే బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని