ఛార్మి వీడియో కాల్‌.. ప్రగతి సంబరం - film celebrities social media round up
close
Published : 03/11/2020 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఛార్మి వీడియో కాల్‌.. ప్రగతి సంబరం

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు..

* ఛార్మి తల్లిదండ్రులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి వారితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఫొటో షేర్‌ చేశారు. ‘నా తల్లిదండ్రులు ఎంతో ధైర్యంగా కరోనా వైరస్‌తో పోరాడుతున్న విధానం చూస్తుంటే నా మనసు సంతోషంతో తేలిపోతోంది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

* తన ప్రియమైన సతీమణి ఐశ్వర్యరాయ్‌కు అభిషేక్‌ బచ్చన్‌ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆమె 47వ జన్మదినం సందర్భంగా.. ‘హ్యాపీ బర్త్‌డే వైఫీ. నువ్వు మా కోసం ఎంతో చేశావు.. వాటికి థాంక్స్‌. నువ్వు ఇలానే సంతోషంగా, నవ్వుతూ ఉండాలి. మేమంతా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాం. ఐ లవ్‌ యూ’ అని పోస్ట్‌ చేశారు. ఇదే సందర్భంగా ఐశ్వర్య తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. కుమార్తె ఆరాధ్యతో తీసుకున్న ఫొటో షేర్‌ చేస్తూ.. పాపే తన సర్వస్వమని పేర్కొన్నారు.

* నటి సన్నీలియోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి హాలోవిన్‌ వేడుకను జరుపుకున్నారు. రంగురంగుల దుస్తుల్లో భర్త డేనియల్‌తో కలిసి ఫన్నీగా కనిపించారు. సన్నీ బార్బీడాల్‌ లుక్‌కు ఫాలోవర్స్‌ నుంచి తెగ కామెంట్లు వచ్చాయి.

* అత్యంత ప్రభావవంతమైన 400 వ్యక్తులు-2020 జాబితాలో తన పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని నటి ప్రగతి తెలిపారు. దీనికి కారణమైన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ఎ.ఆర్‌. రెహమాన్‌, అద్నాన్‌ సమీ వంటి ప్రముఖులున్న జాబితాలో తను కూడా భాగం కావడం ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపారు. ఇదే జాబితాలో తను కూడా ఉన్నట్లు నటి హరితేజ పేర్కొన్నారు.
* తన పుట్టినరోజున ప్రేమ కురిపించిన వారందరికీ షారుక్‌ ఖాన్‌ ధన్యవాదాలు తెలిపారు. తన పేరుపై అవసరాల్లో ఉన్న వారికి సాయం చేసిన అభిమానుల్ని మెచ్చుకున్నారు. కరోనా నేపథ్యంలో అందర్నీ మిస్‌ అవుతున్నానని చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని