ప్రేక్షకులు ముందుకు రావాల్సిన సమయం - films success will boost industry ar rahman
close
Published : 11/04/2021 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేక్షకులు ముందుకు రావాల్సిన సమయం

ముంబయి: ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహ్మన్‌ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘99 సాంగ్స్‌’. ఈహాన్‌ భట్‌, ఎడిల్సీ నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వేశ్‌  కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో హీరో పాత్రకు నటుడు సత్యదేవ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఏప్రిల్‌ 16న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గురించి రెహమాన్‌ మాట్లాడుతూ..‘‘ఒక చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే చిత్రసీమపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ విజయం మొత్తం చిత్రసీమదిగా భావిస్తారు. ప్రజలు చిత్రనిర్మాతలను ప్రోత్సహించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఒక సినిమా చతికిల పడితే ఈ రంగంపై జీవనోపాధి పొందుతున్న వారు తమ ఉపాధిని కోల్పోతారు. కొంతమందయితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలు ధైర్యంగా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. ప్రేక్షకులు మాస్కులు ధరించి, అన్నీ జాగ్రత్తలు తీసుకొని వస్తారని, సురక్షితంగా ఉంటూ సినిమాను ఆస్వాదించాలని ఆశిస్తున్నా’’ అని తెలిపారు. ఐడియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వైఎమ్ మూవీస్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జియో స్టూడియోస్ పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. చిత్రంలో లిసా రే, మనీషా కొయిరాలా, ఆదిత్య సీల్, రంజిత్‌ బారోట్,  రాహుల్ రామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ  భాషల్లో విడుదల కానుంది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని