ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ సెట్‌లో అగ్నిప్రమాదం   - fire accident at aadipurush set at goregaon studio in mumbai
close
Updated : 02/02/2021 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ సెట్‌లో అగ్నిప్రమాదం 

ముంబయి: ముంబయిలోని గోరెగావ్‌లో ఓ ఫిల్మ్‌ స్టూడియోలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఎనిమిది అగ్నిమాపకయంత్రాల సాయంతో మంటలను ఆర్పేశారు. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న ‘ఆది పురుష్‌’ చిత్రీకరణ ఈరోజు అదే స్టూడియోలో ప్రారంభమైంది.  ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్‌, సైఫ్‌ అక్కడ లేరని చిత్ర బృందం తెలిపింది. గోరేగావ్ ఫిల్మ్ స్టూడియోలకు కేంద్రం బిందువు. ప్రముఖ ఫిల్మ్‌సిటీ కూడా అక్కడే ఉంది.  

‘ఆది పురుష్‌’కు బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌, రావణుడిగా బాలీవుడ్ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ నటించనున్నారు. ‘ఆదిపురుష్‌ ఆరంభం’ అంటూ శుభవార్తను చిత్రబృందం ఈ రోజే అభిమానులతో పంచుకుంది.

ఇదీ చదవండి..

ఈ మెగా డేట్స్‌.. గుర్తుపెట్టుకోండి!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని