మాల్దీవుల్లో తొలిసారి.. గుర్రంపై స్వారీ‌! - first experience in maldives and social look of celebreties
close
Published : 19/11/2020 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాల్దీవుల్లో తొలిసారి.. గుర్రంపై స్వారీ‌!

Social Look: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నటులు తమ రోజూవారి అనుభవాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు అప్డేట్స్‌ ఇస్తుంటారు. కొత్త డ్రెస్‌ వేసుకున్నా.. విహార యాత్రకు వెళ్లినా.. స్నేహితులను కలుసుకున్నా.. ఇలా అన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు. మరి ఈరోజు ఎవరెవరు ఏం పోస్టు చేశారో ఓ లుక్కేద్దామా?

* మాల్దీవుల్లో తన మొదటి సీ బాబ్ అనుభవాన్ని హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ అభిమానులతో పంచుకున్నారు.
* ఈ మెసేజ్‌ కొంచెం మొరటుగా ఉంది. దీనికి LOL (బిగ్గరగా నవ్వడం) అని రిప్లై ఇస్తానని ‘ఇస్మార్ట్‌శంకర్‌’ హీరోయిన్‌ నభానటేశ్‌ ఓ పోస్టు చేశారు.
* గుర్రంపై స్వారీ చేస్తున్న ఓ ఫొటోను బాలీవుడ్‌ హీరో, కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ అభిమానులతో పంచుకున్నారు.
* ‘మన జీవితంలో ఎన్నో హెచ్చుతగ్గులు, సమస్యలు, అడ్డంకులు వస్తుంటాయి. వాటన్నింటినీ ఎదుర్కోవాలంటే నవ్వడమే మనముందున్న మంచి మార్గం. వాటి నుంచి బయటపడేందుకు నవ్వుతూనే ఉండండి. మీ జీవితాన్ని పూర్తిస్థాయిలో గడపండి. అందుకు మీరు అర్హులు’ అని ఖుష్బూ ట్విటర్‌లో తన ఫొటోలు పోస్టు చేశారు.
* తమిళ స్టార్‌ హీరో శరత్‌కుమార్‌ సైతం జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫొటోను షేర్‌ చేశారు.
* రోజా తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

* ‘ప్రేమతో మీ కార్తిక్‌’ హీరోయిన్‌ సిమ్రత్‌ ‌కౌర్‌ ఒక ఫొటోను షేర్‌ చేసింది.
* తన గారాలపట్టి ఆరాథ్య తొమ్మిదో పుట్టిన రోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కూతురికి శుభాకాంక్షలు చెప్పారు.

* రేపటి రోజు కొత్తగా ఉండాలంటే నిన్నటి కంటే ఎక్కువ కష్టపడాల్సిందేనని హీరో నాగశౌర్య జిమ్‌లో కసరత్తు చేసిన ఫొటోను పంచుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని