వీళ్ల ఇన్‌స్టా ఇలా మొదలైంది.. - first insta post of tollywood heroins
close
Published : 28/02/2021 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీళ్ల ఇన్‌స్టా ఇలా మొదలైంది..

ఫేస్‌బుక్‌ తెరుస్తాం.. సమంత ఫొటో దర్శనమివ్వగానే లైక్‌ కొడతాం.

ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్తాం.. రకుల్‌ యోగా చేస్తున్న వీడియో కనిపించగానే లవ్‌ సింబల్‌ నొక్కుతాం. 

ట్విటర్‌ చూస్తాం .. కృతిశెట్టి ట్వీట్‌ చేయగానే వెంటనే రీ ట్వీట్ చేస్తాం. 

సమంత, రకుల్‌, కృతిశెట్టిని మాత్రమే కాదు చాలామంది తారల్ని సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవుతాం. వాళ్లేం పోస్ట్‌ చేసిన అప్పటికప్పుడు తెలుసుకుంటాం. ఈ విషయంలో హీరోలకంటే నాయికలే చురుగ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇతర మాధ్యమాల కంటే ఇన్‌స్టాలోనే తమ ఫొటోలు పెట్టి సందడి చేస్తారనేదీ విదితమే. మరి మన అభిమాన భామలు ఇన్‌స్టాలో పంచుకున్న తొలి ఫొటో ఏంటి? ఎప్పుడైనా గమనించారా. లేదు అంటే ఇక్కడ చూసేయండి...

సమంత

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆలస్యంగా అడుగుపెడుతున్నానని నాకు  తెలుసు. చివరిగా వచ్చేశాను అంటూ ఈ ఫొటోను షేర్‌ చేశారు సమంత అక్కినేని. 2016 అక్టోబరు 29న ఇన్‌స్టా ఖాతా తెరిచారామె. ఇప్పటి వరకు సామ్‌ని అనుసరిస్తున్న వారి సంఖ్య: 15.2మిలియన్‌

కీర్తి సురేశ్‌

2016 మే 4న ఇన్‌స్టా వేదికపైకి వచ్చారు  కీర్తి సురేశ్‌. అభిమానులతో ఆమె పంచుకున్న తొలి ఫొటో ఇదే. ఇప్పటి వరకు కీర్తిని అనుసరిస్తున్న వారి సంఖ్య: 8 మిలియన్లు

రష్మిక

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌, టాలీవుడ్‌ హీరో రానాతో కలిసి దిగిన ఫొటోను అభిమానుల కోసం ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు రష్మిక. 2015 జనవరి 30న ఆమె ఇన్‌స్టాలో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు రష్మికను అనుసరిస్తున్న వారి సంఖ్య: 12.8 మిలియన్లు

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

2013 మార్చి 9న ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్ట్‌ పెట్టారు రకుల్. ఈ ఫొటోను పంచుకుంటూ ‘చాలా ఆనందంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. ఇప్పటి వరకు రకుల్‌ని అనుసరిస్తున్న వారి సంఖ్య: 16.3 మిలియన్లు

పూజా హెగ్డే 

ఇన్‌స్టాలో పూజా హెగ్డే పెట్టిన తొలి ఫొటో ఇది. ‘ఈరోజు ఓ స్నేహితురాలి షాప్‌కి వచ్చాం. మేము ఎవర్ని కలిశామో చూడండి’ అంటూ 2013 జనవరి 12న ఈ ఫొటోకి వ్యాఖ్యని జతచేశారు పూజా. ఇప్పటి వరకు పూజాని అనుసరిస్తున్న వారి సంఖ్య: 12.8మిలియన్లు

కాజల్‌ అగర్వాల్‌

తన సోదరి, నటి నిషా అగర్వాల్‌తో చిరు నవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోని ఇన్‌స్టా వేదికగా 2014 జులై 24న పంచుకున్నారు కాజల్‌. ఇప్పటి వరకు కాజల్‌ని అనుసరిస్తున్న వారి సంఖ్య: 17.5మిలియన్లు

తమన్నా

2014 ఫిబ్రవరి 4న ఇన్‌స్టా ఖాతా తెరిచి.. ‘ఇన్‌స్టాలోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది’ అంటూ ఈ ఫొటోను పంచుకున్నారు తమన్నా. ఇప్పటి వరకు తమన్నాను అనుసరిస్తున్న వారి సంఖ్య: 12.2మిలియన్లు

అనుపమ పరమేశ్వరన్‌

2016 ఆగస్టు 19న ఇన్‌స్టాలో అడుగుపెట్టారు అనుపమ పరమేశ్వరన్‌. తొలిసారి ఈ ఫొటో పంచుకుంటూ ‘ఏకాంతం’ అంటూ రాసుకొచ్చారు. ఇప్పటి వరకు అనుపమను అనుసరిస్తున్న వారి సంఖ్య: 8.5 మిలియన్లు

అనుష్క

ఇళయరాజాతో దిగిన ఈ ఫొటోని తొలిసారి పోస్ట్‌ చేశారు అనుష్క. 2015 ఏప్రిల్‌ 1న ఆమె ఇన్‌స్టా ఖాతా తెరిచారు. ఇప్పటి వరకు అనుష్కను అనుసరిస్తున్న వారి సంఖ్య: 4.4మిలియన్లు

రాశీఖన్నా

తన స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను తొలిసారి అభిమానులతో పంచుకున్నారు రాశీఖన్నా. 2016 మార్చి 6న ఆమె ఇన్‌స్టా బృందంలో చేరారు. ఇప్పటి వరకు రాశీని అనుసరిస్తున్న వారి సంఖ్య: 6.3 మిలియన్లు

శ్రుతి హాసన్‌

‘నా మొదటి ఇన్‌స్టా ఫొటో’ అంటూ ఈ ఫొటోను షేర్‌ చేశారు శ్రుతిహాసన్‌. 2013 ఆగస్టు 1న ఈ పోస్ట్‌ పెట్టారామె. ఇప్పటి వరకు శ్రుతిని అనుసరిస్తున్న వారి సంఖ్య: 15.9మిలియన్లు

సాయి పల్లవి

2015 జూన్‌ 28న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి చిన్ననాటి ఫొటోను షేర్‌ చేశారు సాయి పల్లవి. ఇప్పటి వరకు సాయి పల్లవిని అనుసరిస్తున్న వారి సంఖ్య: 2.9 మిలియన్లు

కృతి శెట్టి

తొలి సినిమా ‘ఉప్పెన’ విడుదలకు ముందే సంచలనంగా మారింది యువ నాయిక కృతి శెట్టి.  గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌ తెరిచిన ఆమెను 8 లక్షల మంది పాలో అవుతున్నారు. 2020 జనవరి 23న ‘మన చిత్రం ఉప్పెన ఫస్ట్‌లుక్‌’ అంటూ ‘ఉప్పెన’ కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ ఫస్ట్‌లుక్‌ని అభిమానులతో పంచుకున్నారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని