Vijay BEAST: అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ - first look of thalapathy with sniper gun
close
Updated : 21/06/2021 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay BEAST: అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ జన్మదినం సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. విజయ్‌ తన 65వ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలైంది. ‘బీస్ట్’(మృగం) పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. విజయ్‌ పుట్టినరోజు కానుకగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అందులో విజయ్‌ స్నైపర్‌ గన్‌ను పట్టుకొని మాస్‌లుక్‌లో కనిపించారు. పోస్టర్‌ను చూస్తుంటే ఈ సినిమా పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. విజయ్‌తో పాటు డస్కీ సిరెన్‌, పూజా హెగ్డే సందడి చేయనున్నారు. తెలుగులో కూడా బీస్ట్‌ పేరుతోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని