RRR.. ‘సీత’ వచ్చేసింది..! - first look poster of aliabhatt released from rrr
close
Updated : 15/03/2021 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR.. ‘సీత’ వచ్చేసింది..!

ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన చిత్రబృందం

హైదరాబాద్‌: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా కనిపించనున్నారు. ‘సీత’ పాత్రలో ఆమె మెప్పించనున్నారు. శుక్రవారం ఆలియా పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చిత్రబృందం షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ లుక్‌ ప్రతిఒక్కర్నీ ఆకర్షిస్తోంది.

‘‘రామరాజు రాక కోసం బలమైన సంకల్పంతో సీత వేచి చూస్తోంది. ఆమె ఎదురుచూపులు ఎంతో గొప్పవి’’ - ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. చెర్రీకి జంటగా ఆలియాభట్‌, తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటీనటులు ఇందులో భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని