ఇంట్లో జిమ్‌... ఇవి ఉన్నాయా? - fitness equipment that are a must-have in your home gym
close
Published : 29/05/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంట్లో జిమ్‌... ఇవి ఉన్నాయా?

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యం, ప్రశాంతత ప్రతి ఒక్కరి ప్రాధాన్యం. ఇందుకోసం ఎక్కువ మంది అనుసరించే మార్గం జిమ్‌, యోగా సెంటర్లకు వెళ్లడమే. అయితే వైరస్‌ వ్యాప్తి భయంతో ఇంతకుముందులా జిమ్‌, యోగా సెంటర్లకు వెళ్లే అవకాశం ఇప్పుడు లేదు.  ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటూ ఫిట్‌నెస్‌, యోగాపై దృష్టి కేంద్రీకరిస్తున్నవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. అయితే జిమ్‌, యోగా సెంటర్లకు వెళ్లినప్పటి మాదిరిగా ఫలితాలు రావాలంటే అందుకు అవసరమైన కొన్ని పరికరాలు మన ఇంటి జిమ్‌లో తప్పనిసరిగా ఉండాలంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం..

యోగా మ్యాట్‌: ఒక మంచి యోగా మ్యాట్‌ను వినియోగించడం ద్వారా ఆసనాలు వేసేటప్పుడు పట్టు సడలకుండా చూసుకోవచ్చు.  తీవ్ర గాయాల బారిన పడకుండా ఇది రక్షిస్తుంది. అంతేకాదు శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుంది.  దీని వల్ల వివిధ యెగాసనాలు వేసేటప్పుడు అవసరమైన శక్తి మన శరీరానికి అందుతుంది.  

డంబెల్‌ సెట్‌: కండలు పెంచాలంటే  జిమ్‌లో ఉండాల్సిన ముఖ్యమైన సాధనం డంబెల్‌. శరీరంలో అవసరమైన చోట కండరాలు పరిపుష్టం కావాలంటే వీటిని కచ్చితంగా వినియోగించాల్సి ఉంటుంది. శరీరంలోని వివిద భాగాల్లోని కండరాల పెరుగుదలకు విభిన్న బరువులతో డంబెల్స్‌ను ఉపయోగించాలి.

స్కిప్పింగ్‌ రోప్‌(తాడు): మన ఇంటి జిమ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన సాధనం స్కిప్పింగ్‌ రోప్‌. అంటే తాడు. దీంతో కార్డియో, ఏరోబిక్స్‌ లాంటి వ్యాయామాలు చేసే వీలుంటుంది. స్కిప్పింగ్‌ చేయడం వల్ల కాళ్ల పిక్కలు బలంగా తయారవుతాయి. శారీరక సామర్థ్యం పెరుగుతుంది.  ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.  

ఇండోర్‌ సైకిల్‌: మీ శరీరంలోని కొవ్వును తగ్గించుకోవాలనుకుంటున్నారా? మీ గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నారా? కండరాల శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఇంటి జిమ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన సాధనం ఇండోర్‌ సైకిల్‌. ఇది మీ ఇంట్లో కొంత స్థలాన్ని ఆక్రమించినప్పటికీ.. గుండె ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.  దీనిని ఉపయోగించడం ద్వారా గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటమే కాకుండా శరీరంలో ఆక్పిజన్‌ స్థాయులు పెరుగుతాయి.  

పుల్‌ అప్‌ బార్స్‌: శరీరాన్ని బలోపేతం చేసేందుకు పుల్‌ అప్స్ బాగా ఉపకరిస్తాయి. మొత్తం శరీరాన్ని పైకెత్తే ఈ ప్రక్రియతో శక్తి,  ఎక్కువ సమయం పాటు పని చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని