హెలికాప్టర్‌ కూలి ఐదుగురి మృతి - five dead one injured in helicopter crash at alaska glacier
close
Published : 29/03/2021 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెలికాప్టర్‌ కూలి ఐదుగురి మృతి

అలాస్కా: అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. యాంకరేజ్‌ నగరానికి సమీపంలో ఉన్న క్నిక్‌ గ్లేషియర్‌ను (హిమనీనదం) హెలికాప్టర్‌ ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు అలాస్కా స్టేట్‌ ట్రూపర్స్‌ ప్రతినిధి ఆస్టిన్‌ డేనియల్‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

‘యాంకరేజ్‌ నగరానికి సమీపంలో ఉన్న క్నిక్‌ హిమనీనదం వద్ద హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో తనిఖీలు నిర్వహించగా.. పైలట్‌ సహా ఐదుగురు ప్రయాణికులు మరణించినట్లు గుర్తించాం. ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉండగా.. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అలాస్కా ఆర్మీ నేషనల్‌ గార్డ్స్‌, మౌంటెయిన్‌ రెస్క్యూ బృందాల సాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి’ అని డేనియల్‌ తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విమాన రాకపోకలపై ఫెడరల్‌ ఏవియేషన్‌ తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. మరోవైపు జాతీయ రవాణా భద్రతా మండలి అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని