ఆ రాష్ట్రాల్లోనే 70శాతం కరోనా కేసులు - five states account for over 70 percent of india active covid-19 cases
close
Published : 11/04/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రాష్ట్రాల్లోనే 70శాతం కరోనా కేసులు

న్యూదిల్లీ: ఒకవైపు వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంటే మరోవైపు అంతే వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం కేసులు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌,, కేరళ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గతేడాది కరోనా తీవ్ర రూపం దాల్చిన తర్వాత తొలిసారి 11లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవడం గమనార్హం.

గత 24 గంటల్లో ఏకంగా 61,456 కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 48.57శాతం మహారాష్ట్రకు చెందినవే కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న టాప్‌-10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 80.92శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచే రావడం ఆందోళన కలిగించే అంశం. ఇక ఒకరోజులో నమోదయ్యే కేసుల వివరాలు తీసుకుంటే మహారాష్ట్ర 55,411, ఛత్తీస్‌గఢ్‌ 14,098, ఉత్తర్‌ప్రదేశ్‌ 12,748 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో సుమారు 90వేల మంది కరోనా నుంచి కోలుకోగా, 839మంది మృత్యువాతపడ్డారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని