టీమ్‌ఇండియా.. క్వారంటైన్‌కు ఆ ఐదుగురు - five team india members land in mumbai advised home quarantine
close
Published : 21/01/2021 18:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియా.. క్వారంటైన్‌కు ఆ ఐదుగురు

ముంబయి: ఆస్ట్రేలియాలో అదరగొట్టిన టీమ్‌ఇండియా క్రికెటర్లు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీ, ముంబయి, చెన్నై నగరాల్లో దిగారు. అక్కడి విమానాశ్రయాలకు చేరుకున్న అభిమానులు క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. పువ్వులు చల్లుతూ.. డప్పులు వాయిస్తూ.. వీర తిలకం దిద్దారు. ఇక సారథ్యం వహించిన అజింక్య రహానెకైతే ఊహించని రీతిలో స్వాగతం లభించడం గమనార్హం.

ఆసీస్‌ నుంచి నేరుగా ముంబయికి చేరుకున్న ఐదుగురు టీమ్‌ఇండియా సభ్యులకు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌ క్వారంటైన్‌ వెళ్లాలని సూచించారు. ఏడు రోజులు ఇంట్లోనే ఉండాలని కోరారు. విమానాశ్రయంలోనే ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించారు. ‘వారం రోజులు ఇంట్లో క్వారంటైన్‌ అవ్వాలని క్రికెటర్లకు సూచించాం’ అని ఇక్బాల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక సారథి అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌, పృథ్వీషా, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి సంస్థాగత క్వారంటైన్‌ అవ్వాల్సి ఉంటుంది.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. 2-1తో సిరీస్‌ కైవస చేసుకొని ఆసీస్‌కు గర్వభంగం చేసింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36కే ఆలౌటైన భారత జట్టు ఆ తర్వాత చిరస్మరణీయ విజయాలు సాధించింది. మెల్‌బోర్న్‌లో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌ను 1-2తో సమం చేసింది. సిడ్నీలో కీలక ఆటగాళ్లు ఔటైనా.. పంత్‌ చెలరేగాడు. అశ్విన్‌, విహారి భరించలేని నొప్పిని అనుభవిస్తూనే ఆఖరి రోజంతా ఆడి డ్రా చేశారు. ఇక ఆఖరి టెస్టులో పుజారా అండతో శుభ్‌మన్‌ గిల్‌, పంత్‌ రెచ్చిపోయారు. తిరుగులేని విజయం అందించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఇవీ చదవండి
ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్‌
స్పైడర్‌ పంత్‌..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని