టెస్ట్‌లు.. టీకా కేంద్రాలు పెంచండి: మోదీ - focus on micro-containment zones modi tells cms
close
Updated : 17/03/2021 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెస్ట్‌లు.. టీకా కేంద్రాలు పెంచండి: మోదీ

కరోనా కట్టడికి మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌లపై దృష్టిపెట్టాలని సీఎంలకు సూచన  

దిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంపై  ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో సెకెండ్‌ వేవ్‌ మొదలైందన్న వార్తల నేపథ్యంలో వైరస్‌ కట్టడికి అవసరమైన చోట్ల మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఏర్పాటుపై దృష్టిసారించాలన్నారు. బుధవారం ఆయన పలు రాష్ట్రాల సీఎంలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై సీఎంలతో చర్చించారు. కరోనా రెండో దశకు చేరకుండా సత్వర, నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలన్నారు. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్‌ కేంద్రాలు పెంచాలని సూచించారు. కరోనాపై పోరాటం ద్వారా భారత్‌ సాధించిన ఆత్మవిశ్వాసం.. నిర్లక్ష్యానికి దారితీయరాదన్నారు. ప్రజలు ఆందోళన, భయానికి గురయ్యేలా కాకుండా ముందు జాగ్రత్త చర్యలతో వారి ఇబ్బందులు తొలగించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 10శాతం టీకాలు వృథా అయ్యాయన్న ఆయన.. దీనిపై సమీక్షించుకోవాలన్నారు. కేసుల పెరుగుదలకు ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే ఈ మహమ్మారి దేశమంతా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  అనేక దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయన్న మోదీ.. కరోనా మరణాలు అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుందని చెప్పారు. 

వైరస్‌ కట్టడికి భారీగా పరీక్షలు నిర్వహించంతో పాటు కొవిడ్‌ నిబంధనల్ని మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. సెకెండ్‌ వేవ్‌ను అడ్డుకొనేందుకు నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలన్నారు. గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో కేసులు పెరగడాన్ని ప్రస్తావిస్తూ.. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలను పెంచాలని, ఇన్ఫెక్షన్‌ను గుర్తించేలా చిన్నచిన్న పట్టణాలపై దృష్టిసారించాలన్నారు.  అలాగే, ఆయా రాష్ట్రాల్లో నిర్వహించే కొవిడ్‌ పరీక్షల్లో 70శాతం ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌లే చేయాలన్నారు. కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, యూపీలను ప్రస్తావిస్తూ యాంటీజెన్‌ పరీక్షలపై ఆధారపడొద్దని సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని