జానపద గాయకుడికి పవన్‌ సత్కారం - folk singer penchal das was felicitated by pawan kalyan and trivikram
close
Published : 09/03/2021 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జానపద గాయకుడికి పవన్‌ సత్కారం

హైదరాబాద్‌: రాయలసీమకు చెందిన జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సత్కరించారు. ‘శ్రీకారం’ సినిమాలోని ‘వస్తానంటివో.. పోతానంటివో..’ జానపద గేయాన్ని పెంచల్‌ దాస్‌ ఆలపించారు. ఆ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. పెంచల్‌దాస్‌ హైదరాబాద్‌లో మంగళవారం పవన్‌కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్ని నేటి తరానికి చేరువ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కొద్దిసేపు జానపదాలు, మాండలికాలు అనే విషయం చర్చించారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. అనంతరం పెంచల్‌దాస్‌ను పవన్‌కల్యాణ్‌ సత్కరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని