కరోనా కమ్ముకొస్తోంది.. ఇవి మరవొద్దు!  - follow these guidelines to fight against corona virus
close
Updated : 09/04/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కమ్ముకొస్తోంది.. ఇవి మరవొద్దు! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత మూడు రోజులుగా వరుసగా లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గతేడాది కంటే కరోనా 2.0 వ్యాప్తి మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నా.. కొవిడ్‌ కట్టడే లక్ష్యంగా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా విజృంభణ మాత్రం ఆగకపోవడం కలవరపెడుతోంది. ప్రజల్లో ఉదాసీనత, నిర్లక్ష్య ధోరణుల వల్లే వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోందంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీకా వేయించుకోవడంతో పాటు కొవిడ్‌ నిబంధనలు పాటించడం వల్లే ఈ మహమ్మారిని ఎదుర్కోవడం సాధ్యమంటున్నారు.

అప్రమత్తతే రక్షణ.. ఈ జాగ్రత్తలు పాటించండి

* మాస్క్‌లు ధరించకుండా బయటకు వెళ్లొద్దు. మాస్కులేని సంచారం రిస్కుతో కూడిన వ్యవహారం. మాస్క్‌ లేకుండా తిరిగితే కఠిన చర్యలకు అవకాశం. 

* బస్సులు, థియేటర్లు, మార్కెట్ల వద్ద అప్రమత్తతే రక్షణ

* అనవసరంగా బయట తిరగవద్దు

* ఒక వేళ అత్యవసర పనులకు బయటకి వెళ్లాల్సి వచ్చినా.. రద్దీ ప్రాంతాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి.

* బయటకి వెళితే మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి

* శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రపరుచుకోవాలి

* కళ్లు, ముక్కు, నోటిని నేరుగా చేతులతో తాకొద్దు

* గోరువెచ్చని నీటిని తాగండి.

* కరచాలనం కంటే నమస్కారం ఆరోగ్యకర పలకరింపు

* జలుబు, ఆగని దగ్గు, గొంతునొప్పి, జ్వరం కరోనా అనుమానిత లక్షణాలు

* వేడుకల్లో గుంపులుగా తిరగడం మంచిది కాదు

కరోనా లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోండి

* అపోహలు వీడి వ్యాక్సిన్‌ వేయించుకోండి

* వ్యాక్సిన్‌ వేసుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందే

* షాపింగ్‌కు వెళ్తే డిజిటల్‌ పేమెంట్స్‌కు ప్రాధాన్యమివ్వండి 

* బయటి నుంచి తీసుకొచ్చిన వస్తువులను శుభ్రపరిచి వినియోగించండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని