IPL 2021: దుబాయ్‌ రాకుంటే జీతాల్లో కోతే! - foreign players salary will be cut by franchises if they dont come to uae for ipl
close
Published : 03/06/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021: దుబాయ్‌ రాకుంటే జీతాల్లో కోతే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ రెండో దశలో ఆడేందుకు యూఏఈకి రాని విదేశీయుల జీతాల్లో కోత పడనుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకు మాత్రమే వారికి వేతనాలు చెల్లిస్తారని సమాచారం. బీసీసీఐ ఒప్పంద ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదట. బోర్డు అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

పరిస్థితులు సహకరించకపోవడంతో ఈ సీజన్లో 29 మ్యాచులే జరిగిన సంగతి తెలిసిందే. ముంబయి, చెన్నై నుంచి దిల్లీ, అహ్మదాబాద్‌కు జట్లు చేరాక వైరస్‌ కలకలం చెలరేగింది. కొందరు ఆటగాళ్లు పాజిటివ్‌గా తేలారు. క్రికెటర్లు ఆందోళన చెందడంతో వెంటనే లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. మిగిలిన మ్యాచులను సెప్టెంబర్లో యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్‌ రెండో దశ జరుగుతున్నందుకు అభిమానులు, ఫ్రాంచైజీలు సంతోషిస్తున్నా.. కొందరు విదేశీ ఆటగాళ్లు వచ్చే అవకాశం లేకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. ఆయా దేశాలకు ద్వైపాక్షిక సిరీసులు ఉండటంతో యూఏఈకి వెళ్లేందుకు అనుమతించమని ఆ బోర్డులు స్పష్టం చేస్తున్నాయి. దాంతో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ క్రికెటర్లు వచ్చే అవకాశం లేదు.

‘అవును, అది నిజమే. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం యూఏఈకి రాకపోతే పారితోషికంలో కోత పెట్టే హక్కులు ఫ్రాంచైజీలకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకే (ప్రొ-రాటా) చెల్లిస్తారు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. ఉదాహరణకు కమిన్స్‌ పూర్తి వేతనం రూ.15.5 కోట్లు. అతడు రాకుంటే రూ.7.75 కోట్లే చెల్లిస్తారు. బీసీసీఐ ఒప్పంద క్రికెటర్లకు మాత్రం ఇబ్బంది లేదు. 2011 నుంచి వారికి బీమా వర్తిస్తుండటమే ఇందుకు కారణం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని