మాజీ క్రికెటర్‌ కిడ్నాప్‌.. తుపాకీతో బెదిరింపులు - former australian test cricketer macgill allegedly kidnapped
close
Published : 05/05/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ క్రికెటర్‌ కిడ్నాప్‌.. తుపాకీతో బెదిరింపులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ స్టువర్ట్‌ మెక్‌గిల్‌ అపహరణ ఉదంతం సంచలనం సృష్టించింది. ఆయనను కిడ్నాప్‌ చేసిన దుండగులు తుపాకీతోనూ బెదిరించి అరగంట తర్వాత విడుదల చేశారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఏప్రిల్‌ 14, రాత్రి 8 గంటలకు మెక్‌గిల్‌ (50)తో 46 ఏళ్ల వ్యక్తి క్రెమోర్నేలో గొడవకు దిగాడు. మరో ఇదరు అతడికి తోడయ్యారు. మెక్‌గిల్‌ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. వెంటనే బ్రింగెల్లీ అనే చోటుకు తీసుకెళ్లారు. అతడిని తుపాకీతో బెదిరించారు. అరగంట తర్వాత బెల్‌మోర్‌ ప్రాంతానికి తీసుకెళ్లి విడుదల చేశారు. రెండు రోజులు భయపడ్డ మెక్‌ గిల్‌ ఏప్రిల్‌ 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా తెలిసిందేమిటంటే ఆ కిడ్నాప్‌ చేసింది మెక్‌ గిల్‌ ప్రేయసి మరియా ఓ మేఘెర్‌ సోదరుడు మారినో సోటిరోపొలస్‌ అని. అతడికి న్యూట్రల్‌ బేలో అరిస్టాటిల్‌ రెస్టారెంట్‌ ఉంది. అక్కడే మెక్‌గిల్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇక అపహరణకు సాయం చేసిన మిగతా ఇద్దరు మిన్‌ గుయెన్‌, ఫ్రెడ్రిక్ రిచర్డ్‌షాప్‌ అని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరిపై పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి ఇళ్లలో సోదాలు చేపట్టారు.

మెక్‌ గిల్‌ లెగ్‌స్పిన్నర్‌. ఆస్ట్రేలియా తరఫున 1998-2008 మధ్యన ఆడాడు. 44 టెస్టుల్లో 208 వికెట్లు తీశాడు. షేన్‌ వార్న్‌ ఉండటంతో అతడి నీడలోనే ఉండిపోయాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని