కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి - former bihar education minister mewalal choudhary dies of covid 19
close
Published : 19/04/2021 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

పట్నా: బిహార్‌లో కరోనా వైరస్‌ బారిన పడి మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరీ మహమ్మారితో పోరాడుతూ సోమవారం మృతి చెందారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘మేవాలాల్‌ గత వారం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో అప్పటి నుంచి పారాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారితో పోరాడుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు’ అని పార్టీ నేతలు తెలిపారు.

బిహార్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేవాలాల్‌ జేడీయూ తరపున తారాపూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జేడీయూ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక..  విద్యాశాఖ మంత్రిగా కేబినెట్‌లో ఆయనకు చోటు కల్పించారు. కానీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన నాలుగు రోజులకే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది

కాగా, కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదివారం రాత్రి కర్ఫ్యూ విధించింది. అంతేకాకుండా మే 15 వరకు విద్యాసంస్థలు అన్ని మూసివేసేందుకు నిర్ణయించింది. మరోవైపు సంక్షోభ సమయంలోనూ విధులు నిబద్దతతో నిర్వర్తిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఒకనెల బోనస్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా బిహార్‌ ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం 39,498 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,722 కేసులు నమోదయ్యాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని