యూసఫ్‌ పఠాన్‌కు కరోనా పాజిటివ్‌  - former india cricketer yusuf pathan tests positive for covid-19
close
Published : 28/03/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూసఫ్‌ పఠాన్‌కు కరోనా పాజిటివ్‌ 

దిల్లీ: భారత మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో ప్రకటించాడు. తేలిక లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపాడు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కూడా కరోనా బారిన పడినట్టు ఈరోజు ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. సచిన్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఈ రోజు యూసఫ్‌ పఠాన్‌ ట్వీట్‌ చేశాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని