Green India Challenge:గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అద్భుతమైన కార్యక్రమం: గంభీర్‌ - former indian cricketer gautam gambhir participated in green india challenge at his home in delhi
close
Published : 11/09/2021 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Green India Challenge:గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అద్భుతమైన కార్యక్రమం: గంభీర్‌

దిల్లీ: భారత మాజీ క్రికెటర్‌, ఈస్ట్ దిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో  గంభీర్ దిల్లీలోని తన నివాస ప్రాంగణంలోని వివేకానంద పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం గౌతమ్ గంభీర్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ.. వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని.. ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని  గంభీర్ కోరారు.అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు.ప్రతి ఒక్కరు ఒక్కో మొక్కను నాటి.. వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని గంభీర్ పేర్కొన్నారు.  గంభీర్‌ మొక్కలు నాటిన వీడియోని ఎంపీ సంతోష్ కుమార్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని