ఆ దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌.. - france says it has entered third covid wave
close
Published : 18/03/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌..

వెల్లడించిన  ప్రభత్వం

ప్యారిస్‌: ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఏకంగా కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రవేశించిందని ఆ దేశ ప్రధానమంత్రి జీన్‌ క్యాస్టెక్స్‌ తెలిపారు. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో 29, 975 కొత్త కేసులు నమోదు కాగా, 320 మంది మృత్యువాతపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించింది. దీంతో మొదటిసారిగా వారం రోజుల సగటు కేసులు 25,000 పైగా పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. నవంబర్‌ 20 తర్వాత ఈ సగటు 4.5 శాతానికి చేరినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 5.29 మిలియన్‌ల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేయడం ద్వారా మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవసరం ఉండకపోవచ్చునని ప్రెసిడెంట్‌ ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కొవిడ్‌ కేసులను ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. దీంతో రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కొత్తగా లాక్‌డౌన్‌ విధించడంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చునని ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీలో బ్రిటన్‌, అమెరికా కన్నా యూరోపియన్‌, ఫ్రాన్స్‌ దేశాలు వెనకబడి ఉన్నాయి. అయితే ఆరోగ్యభద్రతా ప్రమాణాల దృష్ట్యా ఫ్రాన్స్‌లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే... ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 4.11 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు వచ్చిన దేశాల్లో ఫ్రాన్స్‌ ఏడో స్థానంలో ఉంది.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని