వ్యాక్సిన్‌ వేయించుకుంటే.. మొబైల్‌ రీఛార్జ్‌ ఫ్రీ..! - free mobile recharge for taking covid vaccine shot mp bjp mlas unique offer to push vaccination drive
close
Published : 18/06/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ వేయించుకుంటే.. మొబైల్‌ రీఛార్జ్‌ ఫ్రీ..!

భోపాల్‌: కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించడంలో భాగంగా మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యే ఓ వినూత్న ఆలోచన చేశారు. ఈ నెల 30 లోగా వ్యాక్సిన్‌ తీనుకున్న నియోజకవర్గ ప్రజలందరికీ ఉచితంగా మొబైల్‌ రీఛార్జ్‌ చేయనున్నట్లు బెరాసియా ఎమ్మెల్యే, భాజపా నేత విష్ణు కత్రి ప్రకటించారు. నియోజకవర్గంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తొలి పంచాయతీకి రూ.20 లక్షల నగదు బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గంలోని చాలా పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజల్లో వ్యాక్సిన్‌ తీసుకోవడంపై ఇంకా భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయని తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని వివరించారు. అందుకే వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. 

అంతకుముందు హోషంగాబాద్‌ ఎమ్మెల్యే సీతా శరణ్‌ కూడా తన నియోజకవర్గంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న గ్రామానికి రూ.10 లక్షల బహుమానం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తన నియోజకవర్గంలో 23 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 40 గ్రామాలున్నాయని ఆయన వివరించారు. గత నెల వరకు ఆ గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ రేటు 17 శాతంగా ఉందని తెలిపారు. అయితే బహుమతుల ప్రకటనతో వ్యాక్సినేషన్‌ రేటు 52 శాతానికి పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని