ఫన్నీ: ఈ ఫీల్డింగ్‌కు 100 పరుగులైనా తీయొచ్చు! - funny fielding in eroup cricket
close
Published : 12/03/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫన్నీ: ఈ ఫీల్డింగ్‌కు 100 పరుగులైనా తీయొచ్చు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్లో అప్పుడప్పుడు సరదా సంఘటనలూ చోటుచేసుకుంటుంటాయి. వాటిని చూసి అభిమానులను కడుపుబ్బా నవ్వుకుంటారు. ఐపీఎల్‌ సహా అనేక క్రికెట్‌ లీగుల్లో హాస్య సన్నివేశాలను మనం చూసుంటాం. తాజాగా ఐరోపా క్రికెట్‌ లీగ్‌లో ఓ జట్టు ఫీల్డింగ్‌ చూస్తే నవ్వకుండా ఉండలేం. 

ఐరోపా క్రికెట్‌ సిరీస్లో వర్మడో సీసీ, స్టాక్‌హోం సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. స్టాక్‌హోం ఆటగాడు కీపర్‌ వెనక్కి బంతిని ఆడగా కీపర్‌ పరుగెత్తుకు వెళ్లాడు కానీ క్యాచ్‌ అందుకోలేకపోయాడు. ఇంతలోనే బ్యాట్స్‌మెన్‌ పరుగు ఆరంభించారు. కీపర్‌ బౌలర్‌ వైపు బంతి విసరగా అతడు పట్టుకోలేదు. దాంతో బ్యాటర్లు మరో పరుగు అందుకున్నారు. ఇంతలోనే లాంగాన్‌లోని ఫీల్డర్‌ బంతిని విసరగా మళ్లీ ఎవ్వరూ పట్టుకోలేదు. దాంతో బ్యాటర్లు మళ్లీ పరుగు తీయడం మొదలుపెట్టారు. ఇలా మొత్తంగా వారు నాలుగు పరుగులు చేయడం గమనార్హం. ఆయాసం వచ్చి ఆగిపోయారు కానీ ఆ ఫీల్డింగ్‌కు మరో రెండు పరుగులు తీసినా ఆశ్చర్యమేమీ లేదు!

ప్రస్తుతం వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ సహా చాలామంది దీనికి స్పందించారు. ‘ఇప్పుడు ఇదే అసలైన క్రికెట్‌!!!’ అని వాన్‌ కామెంట్‌ చేశాడు. ‘బ్యాట్స్‌మన్‌ ప్యాడ్లు జారిపోతున్నా నాలుగు పరుగులు తీయడం గొప్పే’ అని మరొకరు అన్నారు. ‘ఇలాంటి ఫీల్డింగ్‌ పరిస్థితులు ఉంటే నా పిల్లి సెంచరీ పరుగులు తీయగలదు’ అని ఇంకొకరు చమత్కరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని