రాజనాలను చూసి మహిళలు పరుగో పరుగు - funny incident about rajanala kaleswara rao
close
Updated : 21/09/2020 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజనాలను చూసి మహిళలు పరుగో పరుగు

విలన్‌ పాత్రలతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన నటుడు రాజనాల. ప్రతినాయక పాత్రల్లో ఆయన చూపించిన క్రూరత్వం ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేసింది. అది ఎంతలా అంటే.. తెరపై ఆయనది నటన అయినా, బయట కూడా ఆయన నిజంగా అలాగే  ఉంటారేమో అన్నంత భయం.

‘వరకట్నం’ (1968) చిత్ర షూటింగ్‌ తాడేపల్లిగూడెం ప్రాంతంలో జరిగింది. అక్కడ షాట్‌ గ్యాప్‌ వచ్చినప్పుడల్లా చిత్ర ప్రధాన తారాగణమంతా రోడ్డు పక్కన ఉన్న చెట్టు నీడలో సేద తీరుతుండే వారు. ఆ సమయంలో అక్కడకొచ్చిన అభిమానులు తారల చుట్టూ చేరుతుండేవారు. ఓరోజు చిత్ర కథానాయిక కృష్ణకుమారి అక్కడ చెట్టు కింద కూర్చోని ఉండగా.. ఆమెతో మాట్లాడేందుకు కొద్దిమంది స్థానిక గ్రామాల నుంచి మహిళలు వచ్చారు. అంతలో రాజనాల తన షాట్‌ పూర్తి కాగానే అటు వైపుగా వచ్చారు. దీంతో అక్కడున్న స్త్రీలంతా ఆయన్ను చూసి ‘అమ్మో రాజనాల!’ అంటూ దూరంగా పరిగెత్తారట. తర్వాత కృష్ణకుమారి, రాజనాల ఆ మహిళల అమాయకత్వం చూసి తెగ నవ్వుకున్నారట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని