‘గాలి సంపత్‌’ ట్రైలర్‌ వచ్చేసింది! - gaali sampath trailer release
close
Updated : 27/02/2021 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గాలి సంపత్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గాలి సంపత్‌’. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్‌ ఎస్.ఎస్‌. రాజమౌళి విడుదల చేశారు. ఇందులో రాజేంద్రప్రసాద్‌ కేవలం ‘ఫిఫీ’ అనే సౌండ్‌తోనే సంభాషణలు పలకడం విశేషం. ఆ క్రమంలో కమెడియన్‌ సత్యతో హాస్య సన్నివేశాలు బాగా పండాయి. అలాగే కొడుకుపాత్రలో నటిస్తున్న శ్రీవిష్ణు ‘నేను కూడా మా నాన్నను కాస్త ఓపిగ్గా, ప్రేమగా అడగాల్సింది సార్‌’ అని చెప్తున్న డైలాగ్ వాళ్లిద్దరి మధ్య ఉన్న బలమైన బంధాన్ని తెలియజేస్తుంది.

ఇందులో రాజేంద్రప్రసాద్‌ ఒక పత్యేక పరిస్థితుల్లో చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. చివర్లో తనికెళ్ల భరణి ‘ప్రకృతికి ఏం తెలుసు ఎవరు మంచోళ్లో, ఎవరో చెడ్డోళ్లో’అని అంటున్న మాటలు‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. లవ్లీసింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అచ్చు స్వరాలు సమకూరుస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌, ఇమేజ్‌ స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న థియేటర్లలోకి సినిమా రానుంది. మరి లేటెందుకు ఆ ట్రైలర్‌  మీరు చూసేయండి!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని