గబ్బా టెస్ట్‌: తొలి ఓవర్‌లోనే వికెట్‌ - gabba test: wicket in first over
close
Updated : 15/01/2021 06:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గబ్బా టెస్ట్‌: తొలి ఓవర్‌లోనే వికెట్‌

బ్రిస్బేన్‌: బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఓవర్‌లోనే భారత్‌ షాకిచ్చింది. సిరీస్‌లో సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న డేవిడ్‌ వార్నర్‌ (1)ను మహ్మద్‌ సిరాజ్‌ పెవిలియన్‌కు పంపించేశాడు. తొలి ఓవర్‌ నాలుగో బంతికి స్లిప్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్‌ స్లిప్‌కు కాస్త ముందు పడుతున్న బంతిని రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్‌ డైవ్‌ చేస్తూ సూపర్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. గాయాల కారణంగా మొత్తం కొత్త బౌలర్లతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే వికెట్‌ దక్కడం ఎంతైనా ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం క్రీజులో మార్కస్‌ హారిస్‌ (5*), మార్నస్‌ లబుషేన్‌ (5*) ఉన్నారు. ఏడు ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 17/1.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని