మార్గదర్శకాలు పాటిస్తూ గణేశ్‌ ఉత్సవాలు - ganesh festivals with covid rules
close
Updated : 27/07/2020 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్గదర్శకాలు పాటిస్తూ గణేశ్‌ ఉత్సవాలు

ప్రజలకు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ పిలుపు

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్‌-19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేశుని ఉత్సవాలు జరుపుకోవాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. వినాయకుడి పూజకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు కోరారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్‌ 1వ తేదీన సామూహిక నిమజ్జనం వీలుకాదని.. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ నిమజ్జనం జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. సహజ నీటి వనరులు ఉన్న చోట తక్కువ మందితో సాదా సీదాగా నిమజ్జనం జరపాలని సూచించారు. గణేష్‌ విగ్రహాల ఎత్తుల గురించి ఎవరూ పోటీ పడొద్దన్నారు. మండపాల వద్ద నలుగురు లేదా ఐదు మంది మాత్రమే ఉండాలని, శానిటైజర్లు, మాస్కులు వాడాలని తెలిపారు. విగ్రహ తయారీదారులను, ఉత్సవాలపై ఆధారపడి జీవనం సాగించే వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.  ఉత్సవాలకు సంబంధించి అనుమతులు అవసరంలేదని.. కానీ, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు భగవంతరావు సూచించారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని