ఎవ్వడికీ భయపడకూడదు: ఆలియాభట్‌ - gangubai kathiawadi telugu teaser
close
Published : 09/04/2021 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవ్వడికీ భయపడకూడదు: ఆలియాభట్‌

ఆకట్టుకునేలా ‘గంగూబాయ్‌ కతియావాడి’ తెలుగు టీజర్‌

హైదరాబాద్‌: ‘గౌరవంతో బతకాలి. ఎవ్వడికీ భయపడకూడదు. పోలీసుకైనా, మంత్రికైనా, ఎమ్మెల్యేకైనా..’ అని అంటున్నారు ఆలియాభట్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయ్‌ కతియావాడి’. ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ విడుదలైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా తెలుగు టీజర్‌ విడుదలయ్యింది. ‘వకీల్‌సాబ్‌’ థియేటర్లలో ఈ టీజర్‌ ప్రదర్శితమవుతోంది.

‘కామటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగూ ఉంటుంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. అలాగే ‘గంగూ చంద్రిక చంద్రుడిలానే ఉంటుంది’, ‘నేల మీద కూర్చొని భలేగా కనిపిస్తున్నావ్‌ నువ్వు. అలవాటు చేసుకో ఎందుకంటే కుర్చీ పోయిందిగా’ అంటూ ఆలియా చెప్పిన డైలాగులు, ఆమె హావభావాలు మెప్పిస్తున్నాయి. జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని