నేనూ కరోనా బారిన పడ్డా: జెనీలియా - genelia tested corona positive
close
Published : 30/08/2020 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేనూ కరోనా బారిన పడ్డా: జెనీలియా

ముంబయి: ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాలతో అలరించిన కథానాయిక జెనీలియా. ‘బాయ్స్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె ఆ తర్వాత ‘సాంబ’, ‘సై’, ‘ఢీ’, ‘బొమ్మరిల్లు’, ‘సత్యం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ‘బొమ్మరిల్లు’లో హాసినగా ఆమె నటన ఎవర్‌గ్రీన్‌. కాగా, తాజాగా ఆమె కరోనా బారినపడినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

‘‘మూడు వారాల కిందట నేను కరోనా బారినపడ్డా. నాకు ఎలాంటి లక్షణాలూ లేవు. దేవుడి దయవల్ల ఈ రోజు చేసిన పరీక్షల్లో నాకు నెగటివ్‌ వచ్చింది. నేను సులభంగానే కరోనాను జయించాను. అయితే, ఈ 21 రోజులు ఐసోలేషన్‌లో ఉండటం నాకు సవాల్‌గా అనిపించింది. వీడియో కాల్స్‌, డిజిటల్‌ సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో నాకు ఒంటరితనం అనేది అనిపించలేదు. ఇప్పుడు నా ప్రియమైన కుటుంబాన్ని కలుసుకున్నా. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఏదైనా సమస్య అనిపిస్తే, వెంటనే పరీక్ష చేయించుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. దృఢంగా ఉండండి. ఈ మహమ్మారిపై పోరాటానికి ఇదే మార్గం మీ జెనీలియా’’ అని చెప్పుకొచ్చారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని