అంతర్జాతీయ రూపే కార్డులపై ఎన్‌పీసీఐ ఆఫర్లు
close
Published : 03/01/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతర్జాతీయ రూపే కార్డులపై ఎన్‌పీసీఐ ఆఫర్లు

ముంబయి: అంతర్జాతీయ రూపే(క్రెడిట్‌, డెబిట్‌) కార్డు వినియోగదారులకు భారత జాతీయ పేమెంట్స్‌ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐ) శుభవార్త తెలిపింది. ‘రూపే ట్రావెల్ టేల్స్‌’ పథకంలో భాగంగా విదేశాల్లో పర్యటించే వారికి పీవోఎస్ ట్రాన్సాక్షన్లపై 40శాతం ఆఫర్లను ప్రకటించింది. యూఏఈ, సింగపూర్‌, శ్రీలంక, యూకే, యూఎస్‌ఏ, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, థాయిలాండ్‌ దేశాల్లో ఈ ఆఫర్లు వినియోగించుకోవచ్చని తెలిపింది. విదేశీ పర్యటనలు చేసేవారిని డిజిటల్‌ పేమెంట్స్‌ దిశగా ప్రోత్సహించే దిశగా ఈ పద్దతిని తీసుకువచ్చింది. ఈ ఆఫర్ల ద్వారా కార్డు వినియోగదారులు న్యూఇయర్‌ సహా వేసవి సెలవుల పర్యటనల్లో చేసే షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్‌తో పాటు, మరింత ఎక్కువ నగదు ఆదా చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ ఆఫర్‌ పొందడానికి వినియోగదారులు తమ రూపే కార్డును సంబంధిత బ్యాంకు, లేదా నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా యాక్టివేషన్‌ చేసుకోవల్సి ఉంటుంది. 

ఈ ఆఫర్లను పొందాలంటే కనిష్ఠంగా రూ.1000 కొనుగోలు చేయాలి.. క్యాష్‌బ్యాక్‌ గరిష్ఠంగా రూ.4వేల వరకు వస్తుందని ఎన్‌పీసీఐ తెలిపింది. ఇలా నెలలో నాలుగు సార్లు ఈ ఆఫర్‌ను పొందడం ద్వారా.. దాదాపు రూ.16వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉంటే మరింత లబ్ది పొందవచ్చు. ఈ సందర్భంగా ఎన్‌పీసీఐ సీఓఓ ప్రవీణా రాయ్‌ మాట్లాడుతూ.. రూపే ట్రావెల్‌ టేల్స్‌ పథకం కింద గ్లోబల్‌ ఆఫర్లు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా వినియోగదారులు నగదు క్యాష్‌బ్యాక్‌లు పొందవచ్చని అన్నారు. అంతేకాకుండా అదనంగా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని లాంజ్‌లలో అనుమతి పొందవచ్చు. థామస్‌ కుక్‌, మేక్‌మై ట్రిప్‌ వంటి సైట్లలో విమాన టికెట్ల బుకింగ్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చని తెలిపారు. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని