ఐదో రోజూ పెరిగిన పెట్రోల్‌ ధరలు
close
Published : 06/01/2020 22:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదో రోజూ పెరిగిన పెట్రోల్‌ ధరలు

దిల్లీ: అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో పెట్రోల్‌ ధరలు భగ్గుమన్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్‌ ధరలు వరుసగా ఐదో రోజూ పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 15 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 17 పైసలు చొప్పున పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా బ్యారెల్‌ చమురు ధర 70 డాలర్లకు చేరింది.

తాజా పెరుగుదలతో దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.75.69కు చేరింది. 2018 నవంబర్‌ తర్వాత దిల్లీలో ఈ స్థాయిలోక పెట్రోల్‌ ధర పెరగడం ఇదే తొలిసారి. డీజిల్‌ ధర  సైతం రూ.68.68కి చేరింది. ఆయా రాష్ట్రాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. భారత్‌ 84 శాతం చమురు దిగుమతులపై ఆధారపడుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు పెరిగినప్పుడు ఇక్కడా చమురు ధరలకు రెక్కలు వస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని