51 సంస్థలపై సీబీఐ కేసు
close
Published : 06/01/2020 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

51 సంస్థలపై సీబీఐ కేసు

దిల్లీ: 2014-15 మధ్యకాలంలో దేశం నుంచి దాదాపు వెయ్యి కోట్ల నల్లధనాన్ని హాంకాంగ్‌కు తరలించారన్న ఆరోపణలతో సీబీఐ సోమవారం పలు సంస్థలపై కేసు నమోదు చేసింది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. దాదాపు రూ.1,038 కోట్ల రూపాయల నల్లధనాన్ని హాంకాంగ్‌కు తరలించారనే ఆరోపణలతో 51 సంస్థలపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అందులో ఎక్కువగా చెన్నై వాసులకు చెందినవే ఉండటం గమనార్హం. ఆ నిధులు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, పీఎన్‌బీ ప్రభుత్వ బ్యాంకుల అధికారుల సమ్మతితో దారి మళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ బ్యాంకుల్లోని నాలుగు బ్రాంచుల్లో 48 సంస్థలకు సంబంధించి 51 కరెంటు అకౌంట్లు తెరిచినట్లు అందిన సమాచారంతో విచారణ చేపట్టామని చెప్పారు. వస్తువుల దిగుమతి పేరుతో 24 ఖాతాల నుంచి రూ.488.39 కోట్లు, అదేవిధంగా విదేశాలకు భారత పర్యాటకుల సందర్శన పేరు మీద 27 ఖాతాల నుంచి రూ.549.95 కోట్లను విదేశాలకు తరలించినట్లు అధికారులు ఆరోపించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని