63 మంది సంపద దేశ బడ్జెట్‌ కంటే ఎక్కువ!
close
Updated : 20/01/2020 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

63 మంది సంపద దేశ బడ్జెట్‌ కంటే ఎక్కువ!

దిల్లీ: భారత్‌లోని 63 మంది బిలియనీర్ల సంపద మొత్తం కలిపితే దేశ వార్షిక బడ్జెట్‌ కంటే ఎక్కువే ఉంటుందని అంతర్జాతీయ హక్కుల సంస్థ ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదిక పేర్కొంది. అలాగే ఆర్థికంగా దిగువన ఉన్న 95.3 కోట్ల మంది ప్రజల సంపద కంటే కేవలం ఒక శాతం ధనవంతుల వద్ద ఉన్న సంపదే ఎక్కువని స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆక్స్‌ఫామ్‌ పలు కీలక అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత దశాబ్దకాలంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపయిందని తెలిపింది. గత ఏడాది కాలంగా వారి మొత్తం సంపదలో తగ్గుదల కనిపించినట్లు వెల్లడించింది. ఆర్థిక అసమానతలు రూపుమాపే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సి ఉందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా సీఈవో అమితాబ్‌ బెహర్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా చాలా తక్కువ దేశాలు అడుగులు వేస్తున్నాయని తెలిపారు. లింగ భేదాల వల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని నివేదిక వివరించింది. 

నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు...
* ఒక టెక్‌ కంపెనీ సీఈవో సంవత్సరంలో ఆర్జించే మొత్తాన్ని సంపాదించడానికి ఒక సాధారణ గృహిణికి 22,277 సంవత్సరాలు పడుతుంది. సెకనుకు సగటున రూ.106 చొప్పున 10 నిమిషాల్లో ఓ సీఈవో సంపాదించే మొత్తాన్ని ఆర్జించడానికి మహిళకు ఒక ఏడాది సమయం పడుతుంది. 

* దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు రోజుకు 3.26 బిలియన్ల గంటలు ఎలాంటి భత్యం లేకుండా పని చేస్తున్నారు. ఈ లెక్కన వారంతా కలిసి ఏడాదికి సంపాదించగలిగే రూ.19 లక్షల కోట్ల మొత్తం భారత విద్యాశాఖ బడ్జెట్‌ కంటే 20 రెట్లు ఎక్కువ.

* జీడీపీలో రెండు శాతంగా ఉన్న సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల్ని నేరుగా అనుమతించడం వల్ల 2018లో కోల్పోయిన 11 మిలియన్ల ఉద్యోగాల్ని తిరిగి సృష్టించవచ్చు. 

* ప్రపంచంలోని తొలి 22 మంది ధనవంతుల సంపద.. ఆఫ్రికాలో ఉన్న మొత్తం మహిళల సంపద కంటే ఎక్కువ. 

* ప్రపంచ అత్యంత ధనవంతుల్లో 1శాతం మంది పదేళ్లపాటు తమ సంపదపై 0.5శాతం అధిక పన్ను చెల్లిస్తే వృద్ధులు, బాలల సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాల్లో 117 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించొచ్చు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని