జొమాటో చేతికి ఉబెర్‌ ఈట్స్‌
close
Updated : 21/01/2020 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జొమాటో చేతికి ఉబెర్‌ ఈట్స్‌

భారత్‌లో ఇకపై ఉబెర్‌ ఈట్స్‌ సేవలు లభించవు

ముంబయి: భారతీయ ఆహార సరఫరా దిగ్గజం జొమాటో, అమెరికన్‌ ఆన్‌లైన్‌ ఆహార సంస్థ ఉబెర్‌ ఈట్స్‌ను చేజిక్కించుకుంది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు దాదాపు రూ.2500 కోట్ల విలువైన వ్యాపార ఒప్పందం చేసుకొన్నాయి. దీనిప్రకారం ఉబెర్‌ ఈట్స్‌ జొమాటోతో విలీనంమైంది. అందుకు ప్రతిగా ఉబెర్‌కు జొమాటోలో 9.9శాతం వాటా లభించింది. అంతేకాకుండా ఉబెర్‌ ఈట్స్‌ వినియోగదారులందరినీ జొమాటోకు బదలాయించారు. అయితే ఉబెర్‌ ఈట్స్‌ ఉద్యోగులను మాత్రం జొమాటో స్వీకరించదట. భారత్‌లో పనిచేస్తున్న 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు పదవీ విరమణ ఇవ్వడంగానీ, లేదా వేరే విభాగాలకు మళ్లిస్తారు. ‘‘భారత్‌లో మా ఆహార సామ్రాజ్యాన్ని స్థాపించి దానిని 500 పైగా నగరాలకు విస్తరించినందుకు గర్విస్తున్నాం. మా తాజా కొనుగోలుతో ఆహార సరఫరా రంగంలో మా స్థానం మరింత బలోపేతం కానుంది’’ అని జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ప్రకటించారు.

మరోపక్క ‘‘2017లో మేము భారత అన్‌లైన్‌ ఆహార రంగంలో ప్రవేశించాము. ఈ రోజు మా ప్రయాణం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఉబెర్‌ ఈట్స్‌ను నేడు జొమాటో కొనుగోలు చేసింది.. ఈ ఒప్పందం తక్షణమే అమలులోకి రానుండటంతో ఉబెర్‌ ఈట్స్‌ సేవలు భారత్‌లో ఇకపై లభ్యం కావు. మా వినియోగదారులకు రానున్న రోజుల్లో చక్కటి ఆహారంతో మరింత సంతోషం లభించాలని కోరుకుంటున్నాం’’ అని తన ఉబెర్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది. ఈ తాజా పరిణామంతో ఉబెర్‌ ఈట్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాలలో జొమాటోకు గట్టి పట్టు దక్కనుంది. ఈ డీల్‌పై తెల్లవారుజామున 3గంటలకు సంతకాలు పూర్తయ్యాయి. ఉదయం ఏడుగంటలకు ఉబెర్‌ ఈట్స్‌ వినియోగదారులు జొమాటో యాప్‌కు బదిలీ అయ్యారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని