ఎల్‌ఐసీ ఐపీవోకు వచ్చేది అప్పుడే
close
Published : 03/02/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎల్‌ఐసీ ఐపీవోకు వచ్చేది అప్పుడే

దిల్లీ: ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ.. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో లిస్టింగ్‌కు వచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎల్‌ఐసీ వాటాలు విక్రయిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, లిస్టింగ్‌కు ప్రస్తుతమున్న ప్రకియను అనుసరిస్తామని, అందుకోసం కొన్ని చట్ట సవరణలు అవసరమని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇందుకోసం న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో లిస్టింగ్‌కు రావొచ్చని తెలిపారు. 

ఎంతమొత్తం వాటా విక్రయించేది మాత్రం రాజీవ్‌ కుమార్‌ స్పష్టంగా వెల్లడించలేదు. సుమారు 10 శాతం వాటాలు విక్రయించొచ్చని, దానిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. ఎల్‌ఐసీని లిస్టింగ్‌కు తీసుకురావడం ద్వారా రూ.90వేల కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మొత్తం రూ.2.10 లక్షల కోట్లను రాబట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసీలో 100 శాతం వాటా ఉంది.

ఇదీ చదవండి..
పబ్లిక్‌ ఇష్యూకు ఎల్‌ఐసీ
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని