భారత్‌లో 25,000 హార్లీ డేవిడ్‌సన్‌ మోటార్‌సైకిళ్లు..!
close
Published : 04/02/2020 18:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 25,000 హార్లీ డేవిడ్‌సన్‌ మోటార్‌సైకిళ్లు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు చెందిన విలాసవంతమైన మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ భారత్‌లో 25వేలకు పైగా వాహనాలను విక్రయించింది. ఈ అమ్మకాల్లో అత్యధికంగా మేడిన్‌ ఇండియా బ్రాండ్‌ స్ట్రీట్‌ 750 విక్రయాలు అత్యధికంగా ఉన్నాయి. భారత్‌లో 2009లో ప్రవేశించిన హార్లీ ఇప్పటి వరకు 10ఏళ్లను పూర్తి చేసుకొంది. ఈ కంపెనీ బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచిన స్ట్రీట్‌ 750 బైకు బీఎస్‌6 మోడల్‌లో తయారైన అత్యంత శక్తివంతమైన బైకుగా నిలిచింది. 
‘‘భారత్‌లో ప్రీమియం మోటార్‌ సైకిళ్లను తయారు చేసి మా మార్కెట్‌ను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకొన్నాము. దీనికి తగినట్లే ఇప్పుడు భారత్‌లో అత్యంత శక్తివంతమైన వాహనాల కొనుగోలుదారులకు మేమే మొదటి ఛాయస్‌గా ఉన్నాము. భారత్‌లో 33 డీలర్లను ఏర్పాటు చేసుకొన్నాము. ప్రీమియం బైకుల్లో మాకే పెద్ద నెట్‌వర్క్‌ ఉంది. మరిన్ని సృజనాత్మకమైన వాహనాలను తీసుకొస్తామని నమ్మకంగా చెబుతున్నాము’’ అని హార్లీ డేవిడ్‌సన్‌ భారతీయ విభాగం ఎండీ సజీవ్‌ రాజశేఖరన్‌ తెలిపారు. 2019లో హార్లీ డేవిడ్‌సన్‌ను రైడింగ్‌ అకాడమీని ఏర్పాటు చేసింది. రైడర్స్‌ నైపుణ్యాలు పెంచడానికి.. లైఫ్‌స్టైల్‌ మోటార్‌ సైక్లింగ్‌ను పెంచడానికి దీనిని వాడుకోవాలని నిర్ణయించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని