ప్రశాంత జీవనానికి ఆనంద్‌ మహీంద్రా చిట్కాలు
close
Published : 13/02/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రశాంత జీవనానికి ఆనంద్‌ మహీంద్రా చిట్కాలు

ముంబయి: తీరిక లేని పనులు, ఉద్యోగంలో ఉరుకులు పరుగులు, నెలాఖర్లో టార్గెట్ల ఒత్తిడి, మొత్తంగా ప్రశాంతత లేని జీవితం! ఈ ఇంటర్నెట్‌, గ్యాడ్జెట్ల కాలంలో ప్రతి ఒక్కరి దైనందిన జీవితం ఇలాగే మారిపోయింది. అందుకే సుఖ జీవన విధానం, ప్రశాంతత కోసం ఏవేవో సూత్రాలు, తత్వాలు పాటిస్తుంటారు. ఐతే కార్పొరేట్‌ యుగంలో ప్రశాంత జీవన శైలి కోసం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర ఔషధాల చీటీతో అవసరం లేని ఓ చిత్రాన్ని ట్వీట్‌ చేశారు. అది జపనీయులు పాటించే ‘ఇకిగై’ గురించి.

‘తత్వశాస్త్రాల గురించి నాకు ఎక్కువగా తెలియదు. జీవితం కోసం రూపొందించిన ఈ చిత్రంలో తత్వాన్ని అర్థం చేసుకోవడానికి పీహెచ్‌డీ అవసరం లేదు. ఉదయాన్నే నిద్రలేవగానే ఒకసారి చూసి రోజును ఆరంభించేందుకు ఇదో అద్భుత చిత్రం’ అని ఆనంద్‌ మహీంద్రా ఓ చిత్రాన్ని ట్వీట్‌ చేశారు. అది జపనీయులు బోధించిన ‘ఇకిగై’ జీవన విధానం. ప్రశాంతతో నిండిన జీవితం కోసం ఇందులో 10 సూత్రాలను తెలియజేశారు. అవి..

1. అలసిపోవద్దు.. చురుగ్గా ఉండు

2. నెమ్మదిగా పని ఆరంభించు

3. కడుపు నిండా తినకు

4. మంచి మిత్రులతో కలిసుండు

5. ఆరోగ్యకరమైన శరీరం ఉంచుకో

6. నవ్వుతూ ఉండు

7. ప్రకృతితో తిరిగి మమేకం అవ్వు

8. కృతజ్ఞత ప్రకటించు
9. ఈ క్షణాన్ని ఆస్వాదించు

10. నీ ఇకిగైను అనుసరించు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని