రెహమాన్‌... బకాయిలు చెల్లించండి
close
Published : 14/02/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెహమాన్‌... బకాయిలు చెల్లించండి

చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బకాయి వెంటనే చెల్లించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. రెహమాన్‌ చెల్లించాల్సిన పన్ను రూ.6.79కోట్లు, జరిమానా మరో రూ.6.79కోట్లతో సహా చెల్లించాల్సిందిగా జీఎస్టీ, కేంద్ర ఎక్సైజ్‌ శాఖలు ఆదేశాలు జారీ చేశాయి. రెహమాన్‌ తన ఆర్జనకు తగినట్టుగా పన్ను చెల్లించడం లేదని జీఎస్టీ కమిషనర్‌ (చెన్నై సౌత్‌) కేఎం రవిచంద్రన్‌ అన్నారు. ‘‘చలన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చటంతో పాటు దేశ విదేశాల్లో బహిరంగ ప్రదర్శనలతో, రాయల్టీల ద్వారా కూడా ఆయన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఆదాయ మార్గాలన్నీ వస్తుసేవల పన్ను పరిధిలోకి వస్తాయి. కానీ, ఈ సంగీత దర్శకుడు వాటికి పన్ను చెల్లించలేదు’’ అని రవిచంద్రన్‌ వివరించారు.

 ‘రెహమాన్‌ తన ట్యూన్లకు యజమాని అనే మాట నిజమే కాకుంటే.. నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సంగీతానికి సంబంధించి అన్ని హక్కులు నిర్మాతలకే చెందుతాయి.. అందువల్ల అవి సేవాపన్ను పరిధిలోకి వెళ్లవు’ అని రెహమాన్‌ తరపు న్యాయవాది వివరించారు. కాగా, ఆదేశాల అమలును మార్చి నాలుగోతేదీ వరకు నిలిపివేస్తూ  ఉత్తర్వులు ఇవ్వాలని రెహమాన్‌ మద్రాస్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని