‘ఆటోమేషన్‌తో 9శాతం ఉద్యోగాలు కట్‌’
close
Published : 14/02/2020 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆటోమేషన్‌తో 9శాతం ఉద్యోగాలు కట్‌’

ఐఎంఎఫ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డేవిడ్‌ లిప్టన్‌ అంచనా

దిల్లీ: ఆటోమేషన్‌ వల్ల దేశంలో 9శాతం మంది కార్మికులు నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఫస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డేవిడ్ లిప్టన్‌ అంచనా వేశారు. దేశ ఆర్థిక వ్యవస్థని మరింత విస్తరించడం వల్ల వీరికి ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. గురువారం సి.డి.దేశ్‌ముఖ్‌ స్మారకోపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మందగమనాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే దేశ ఆర్థిక వృద్ధి 6-7శాతం ఉండేదని తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది కార్మికులు ఆటోమేషన్‌ వల్ల నిరుద్యోగులుగా మారనున్నారన్నారు. ఎక్కువ మంది కార్మికులు, తక్కువ వేతనాలు ఉండే కంపెనీలకు ముప్పు తప్పదని హెచ్చరించారు.

తాజా బడ్జెట్‌లో దిగుమతులపై ప్రతిపాదించిన సుంకాల పెంపు నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. దీని వల్ల దేశీయ మార్కెట్లో పోటీతత్వం తగ్గి.. అంతర్జాతీయ మార్కెట్లతో ఉన్న అనుసంధానాన్ని దేశీయ విపణి కోల్పోతుందని అభిప్రాయపడ్డారు. పోటీతత్వం వల్ల స్వల్పకాలిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ అంశాన్ని ఆయన క్రికెట్‌తో ముడిపెట్టి వివరించారు. ‘‘కేవలం దేశీయంగానే ఆడాలని భారత్‌ నిర్ణయించుకుని ఉంటే ఈరోజు క్రికెట్‌లో ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు’’ అని వ్యాఖ్యానించారు. మధ్యంతర వస్తువులపై సుంకాలు విధించడం వల్ల ఉద్యోగాల సృష్టికి కారణమయ్యే పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో భారత్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలిపారు.  


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని