ట్రంప్‌ చూసే భారత్‌ భిన్నమైంది: అంబానీ
close
Published : 25/02/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రంప్‌ చూసే భారత్‌ భిన్నమైంది: అంబానీ

ముంబయి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటనపై ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుల కంటే డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త విభిన్న రీతిలో స్వాగతం అందుకున్నారని అన్నారు. ఈ మేరకు అంబానీ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. ‘మోతెరా స్టేడియంలో 1.10 లక్షల మంది ట్రంప్‌ కుటుంబానికి స్వాగతం పలికారు. గతంలో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షులు జిమ్మీ కార్టర్‌, బిల్‌ క్లింటన్‌, బరాక్‌ ఒబామా చూసిన దాని కంటే ట్రంప్‌ చూసే భారత్‌ ఎంతో భిన్నమైనది. భారత్‌ ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి మోతెరా స్టేడియమే గొప్ప ఉదాహరణ. స్టేడియంలోని ఉత్తమ డిజిటల్‌ మౌలిక సౌకర్యాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. మనం 2020లో కొత్త భారత్‌ను ప్రారంభించాం. ప్రపంచంలోని మూడు అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థ దేశాల జాబితాలోకి మనది చేరుతుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు’’ అని అంబానీ పేర్కొన్నారు. అంబానీ రేపు దిల్లీలో ట్రంప్‌తో జరగబోయే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొననున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని