పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం పెంపు
close
Updated : 14/03/2020 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం పెంపు

దిల్లీ: అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరల ప్రయోజనాల్ని వినియోగదారుడికి చేరకముందే కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది.

స్పెషల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని లీటర్‌ పెట్రోల్‌పై రూ.2 నుంచి రూ.8కి, డీజిల్‌పై రూ.4కు పెంచారు. అలాగే రెండు ఇంధనాలపై రోడ్డు సెస్సును లీటరుకు రూ.1 పెంచడంతో రూ.10కి చేరింది. కేంద్రం నిర్ణయంతో సాధారణంగా పెట్రో ధరలు పెరగాల్సి ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీ స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తాజా పెంపుతో లీటర్‌ పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్‌ సుంకం రూ.22.98కు, డీజిల్‌పై రూ.18.83కు ఎగబాకింది. దీంతో కేంద్ర వార్షికాదాయం రూ.39,000 కోట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2014, 2016 లోనూ కేంద్రం ఇదే తరహాలో సుంకాన్ని పెంచింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని